- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోడ్లపై వెళితే.. మీ సంగతి అంతే..
X
దిశ, బజార్ హత్నూర్ : మండలంలోని పాఠశాలలకు వెళ్లే రోడ్డు దుస్థితి ఇది. పలుచోట్ల గుంతలు పడి నీరు నిలిచి ఉంది. చిన్న వర్షానికే రోడ్డు మొత్తం చిత్తడిగా మారి అస్తవ్యస్తం అవుతోంది. ఈ మార్గం గుండా నిత్యం ఆటోలు, బైకులు, కాలినడకన దాదాపు 4 నుండి 5 వందల మంది విద్యార్థులు ప్రయాణిస్తారు. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ నీరు ఉందో తెలియక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వం రోడ్ల కోసం అనేక నిధులు మంజూరు చేస్తున్నామని, గుంతలు లేని రోడ్లే లక్ష్యమని చెబుతున్నా.. వారి మాటలు నీటి మూటలు గానే మిగిలి పోతున్నాయని అంటున్నారు గ్రామస్తులు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా అది కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుంది తప్ప, తమ సమస్యను పరిష్కరించే నాథుడే లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
Advertisement
Next Story