భారత్‌‌లోకి ప్రవేశించిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్

by sudharani |
భారత్‌‌లోకి ప్రవేశించిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం రాష్ట్రంలో రెండు వారాల్లో 30వేలకు పైగా పందులు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 306 గ్రామాల్లో 2500ల పెంపుడు పందులు చనిపోయినట్లుగా ఉంది. అయితే ఇవన్నీ సాధారణ జ్వరంతో చనిపోయాయని అనుకున్నారు. కానీ పరీక్ష చేసి చూస్తే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని తేలింది. అయితే ఇలాంటి జ్వరం భారత్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. అయితే దీని గురించి అస్సాం ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు తీసుకుంది. అక్కడ దాదాపు 20 లక్షల పెంపుడు పందులు ఉన్నాయి. ఈ జ్వరం అన్నింటికీ సోకి నష్టం జరగడానికి ముందే రాష్ట్రాన్ని జోన్ల కింద విభజించి వైరస్ సోకిన పందులు విభజించారు.

ఇదిలా ఉండగా, కజిరంగా జాతీయ పార్కు గుండా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది ఒడ్డున 28 పందుల కళేబరాలు పడిఉండటంతో నదిలో నీళ్లు కలుషితం అయ్యాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఈ జ్వరం పందుల నుంచి మనుషులకి వచ్చే అవకాశం ఉందన్న విషయం గురించి కూడా వైద్యులు పరిశోధన చేస్తున్నారు. ఉన్న టెన్షన్లు చాలనట్లు ఇలా ఎన్నడూ లేని కొత్త జ్వరం భారత్‌లోకి చైనా పక్కన ఉన్న అస్సాం నుంచి రావడం విదేశాంగ విధానాలను కూడా సందిగ్ధంలో పడేయనుందని విశ్లేషకులు అంటున్నారు.

Tags:yellow fever, african swine fever, corona, vaccines, china, assam, India

Advertisement

Next Story

Most Viewed