మరీ ఇన్ని ట్విస్టులతో కథ రాయలేను : అడవి శేషు

by Shyam |
మరీ ఇన్ని ట్విస్టులతో కథ రాయలేను : అడవి శేషు
X

అడవి శేషు సినిమా కథ రాస్తే… అడుగు అడుగునా ట్విస్ట్ లు ఉంటాయి. భిన్నమైన కథలతో సీన్ సీన్ కు ట్విస్ట్ ఇస్తూ… ప్రేక్షకులను కన్విన్స్ చేయగలడు. ఆ కథలో ఇన్వాల్వ్ చేయగలడు. కనీసం చూపు తిప్పుకోకుండా సినిమా చూసే విధంగా దమ్మున్న కథలు రాయగలడు. కానీ ఇప్పుడు ఒక కథ చూసిన శేషు… బాప్ రే… ఇన్ని ట్విస్ట్ లు ఉన్న కథ ఎప్పుడూ రాయలేను అంటున్నాడు. ఇంతకీ ఏం కథ అనుకుంటున్నారా…? సోషల్ మీడియాలో ఫేమస్ అయినా కరోనా కపుల్స్ కథ.

ఢిల్లీ లో ఇద్దరు భార్య భర్తలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. కానీ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో ఆ మహిళ మరో ముగ్గురితో రిలేషన్ లో ఉందని తెలిసింది. వారిని క్వారెంటైన్ కు తరలించే క్రమంలో ఈ ముగ్గురిలో ఒకరికి మరో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసిన అధికారులు షాక్ అయ్యారు. ఈ ఇద్దరి యువతుల్లో ఒకరికి మరింత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసిందట. ఈ న్యూస్ చూసిన శేషు… ఇన్ని ట్విస్ట్ లతో కూడిన కథను నేను రాయడం అసాధ్యమని చెప్తున్నాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నిజమే మీ “ఎవరు” మూవీని మించిన ట్విస్టులు ఉన్నాయని అంటున్నారు.

Tags: Adivi Sesh, Tollywood, Corona, CoronaVirus, Covid 19

Advertisement

Next Story