- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మల్లి’గా దమ్ముంటే నువ్ రాజీనామా చెయ్ : అద్దంకి దయాకర్
దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కాదు.. మీకు దమ్ముంటే మల్లిగా నువ్ రాజీనామా చెయ్.. లేదా కేసీఆర్ చేత గజ్వేల్‌లో రాజీనామా చేయించు.. అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. గాంధీ భవన్‌లో గురువారం ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్.. మల్లిగాని లాంటి కుక్కలతో మోరిగిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సంస్కృతిని టీఆర్ఎస్ నాయకులు మార్చేస్తూ తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము సీఎం కేసీఆర్‌ను తిట్టగలమని అన్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్‌లో పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓడిపోతే కేసీఆర్ తన పని అయిపోయిందని ప్రభుత్వం రద్దు చేసుకుంటారా అంటూ సవాల్ చేశారు. మేము ఎమ్మెల్యే, ఎంపీల కోసం రాజకీయాల్లోకి రాలేదని సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ కోసం పనిచేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని, పిచ్చి మల్లిగాని మాటలతో తెలంగాణ పరువు పోతుందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను డా. బీఆర్ అంబేద్కర్ బహుజన భవన్‌గా మారుస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బహుజన సమాజం ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భిన్న దృక్పథంతో తెలంగాణకి శ్రీకారం చుడుతుందన్నారు.
బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. రెండు రోజుల దీక్షతో కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో మూడు గ్రామాల సమస్యలను సమాజానికి తెలియజేశామన్నారు. కేసీఆర్ మాటల గారడితో మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ గడీ ముందు కట్టేసిన కుక్కలు మల్లారెడ్డి లాంటి వాళ్లు.. అని విమర్శించారు. స్వరాష్ట్ర ఉద్యమంలో 1200 మంది ఆత్మ త్యాగాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం విలాసాలు అనుభవిస్తున్నారని, ఆ అమరవీరుల కుటుంబాల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని హెచ్చరించారు.