అందుకే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా….

by Anukaran |   ( Updated:2020-09-25 11:39:40.0  )
అందుకే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా….
X

దిశ వెబ్ డెస్క్:
నటి అనుష్కశర్మ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలను నటి కంగనా రనౌత్ ఖండించారు. అనుష్క గురించి ఆయన వ్యాఖ్యల్లో ప్రస్తావించి ఉండాల్సింది కాదని అన్నారు. అయితే కొందరు పైశాచిక తత్వం ఉన్న వాళ్లే సునీల్ గవాస్కర్ మాటలకు అసభ్య కోణాన్ని ఆపాదిస్తున్నారని ఆమె అన్నారు .

కాగా గతంలో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. గతంలో కొందరు తనను మోసగత్తే అని నిందించారని ఆమె అన్నారు. అయితే క్రికెట్ వ్యవహారంలోకి అనుష్కను లాగేందుకు సునీల్ గవాస్కర్ ప్రయత్నించాడన్న విషయాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. అయితే తనకు గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అనుష్క స్పందించలేదని అన్నారు. తాను మాత్రం అలా చేయనని తెలిపారు. అందుకే సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు.

Advertisement

Next Story