Tollywood drugs: కేసుపై సుమన్ సంచలన వ్యాఖ్యలు.. వారికే మీడియాలో పబ్లిసిటీ

by srinivas |   ( Updated:2021-09-13 04:18:33.0  )
Tollywood drugs: కేసుపై సుమన్ సంచలన వ్యాఖ్యలు.. వారికే మీడియాలో పబ్లిసిటీ
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు సినీపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఈడీ విచారణ జరుగుతుంది. అయితే ఈ డ్రగ్స్ కేసుపై సినీన‌టుడు సుమ‌న్ తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ కేసులో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. అప్పుడే డ్ర‌గ్స్ అమ్మ‌కాలు, వినియోగం వంటివి పున‌రావృతం కావని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన డ్ర‌గ్స్ వినియోగం దేశంలో చాలా చోట్ల ఉందన్నారు.

కేవలం సినీ రంగంలోనే ఉందనడం సరికాదన్నారు. సినీరంగంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డితే మీడియాలో బాగా ప‌బ్లిసిటీ అవుతోంద‌ని, డ్రగ్స్ వినియోగం.. సరఫరాపై విదేశాల్లో అమలవుతున్న కఠిన శిక్షలను దేశంలోనూ అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలతో బిజీబిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే పోటీ చేయ‌ట్లేద‌ని సుమన్ మీడియాకు తెలియజేశారు.

Advertisement

Next Story