అతని కన్నా నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు: మంచు విష్ణు

by Shyam |   ( Updated:2021-10-09 10:05:04.0  )
Manchu-Vishnu
X

దిశ, వెబ్ డెస్క్: అతని కన్నా నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారంటూ సినీ నటుడు మంచు విష్ణు నాగబాబును ప్రశ్నించారు. శనివారం ఆయన నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు. ఓడిపోతారని తెలిసే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. నాగబాబు అంకుల్ నేను ఏం తప్పు చేశానో చెప్పాలి.. మీరు విమర్శించిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలను.. కానీ, చిరంజీవి అంటే నాకు అభిమానం.. మిమ్మల్ని విమర్శిస్తే చిరంజీవిని అవమానించినట్లే అవుతుందని ఆయన అన్నారు.

మీ బిడ్డలాంటి నన్ను ఎందుకు అంతలా విమర్శిస్తున్నారు.. గతంలో పవన్ కళ్యాణ్ ను తిట్టిన వ్యక్తి ఈరోజు మీకు మేధావి అయిపోయాడా అంటూ ప్రశ్నించారు. అపోజిషన్ అభ్యర్థి తనతోపాటు తన ఫ్యామిలీని కూడా అవమానిస్తున్నారని, ఆ ప్యానెల్ లోని సీనియర్ నటి తన నాన్నగారిపై కూడా విమర్శలు చేసిందని, ఎన్నికల్లో గెలిస్తే రూ. వందల కోట్లు, కిరీటాలు వచ్చేస్తాయా అంటూ నాగబాబును ప్రశ్నించారు.

Advertisement

Next Story