ఇల్లందులో ఆచార్య షూటింగ్.. చిరు రాకతో సందడి

by Jakkula Samataha |
chiru Yellandu
X

దిశ, సినిమా: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘ఆచార్య’ మూవీ యూనిట్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఇల్లందు జేకేఓసీ, 20 ఫీట్ ఏరియాలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏరియా సింగరేణి జీఎం పి.వి. సత్యనారాయణ చిరంజీవికి ఘనస్వాగతం పలికారు. చిరంజీవి రాకతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. కాగా లాస్ట్ షెడ్యూల్‌లో చిరు, చెర్రీ పాల్గొనగా.. ఈ షెడ్యూల్ లో కేవలం చిరుపైనే సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు.

Advertisement

Next Story