HYD-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

by Shyam |   ( Updated:2021-12-05 22:20:39.0  )
HYD-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ మార్గంలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నేషనల్ హైవేపై ఓ లారీ యూ టర్న్ తీసుకుంటోంది. ఈ క్రమంలో రెండు కార్లు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటంలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement

Next Story