ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి: ABVP

by Sridhar Babu |
Abvp-Dharna1
X

దిశ, మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో మద్దూరు పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి,ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన తెలంగాణ సర్కారు నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో గందరగోళంతో లక్షల విద్యార్థుల మానసిక క్షోభకు, ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపించారు. కరోనా సమయంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల నిర్వాహణలో కేవలం ప్రకటనలకే పరిమితమై విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంలో విఫలమైన ప్రభుత్వం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి చేయకుండానే ఆకస్మికంగా పరీక్షలు నిర్వహించడంతో అయోమయంతో విద్యార్థులు గందరగొళానికి గురై నష్టపోయామన్నారు.

Advertisement

Next Story