కేసీఆర్‌కు మరో అవకాశం ఇస్తున్నాం.. ఏబీవీపీ హెచ్చరిక

by Shyam |   ( Updated:2021-09-17 10:58:13.0  )
ABVP leaders
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఏబీవీపీ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 150 అడుగుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీశారు. స్థానిక విద్యార్థులతో శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కంగ్ కమిటీ సభ్యులు శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ సంజీవరెడ్డిలు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి 1947లో ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న సిద్ధించిందని తెలిపారు.

ABVP leaders

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని, కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఎందుకు జరుపడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మరో అవకాశం ఇస్తున్నామని, వచ్చే ఏడాదైనా అధికారికంగా నిర్వహించాలని, లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శశిధర్ రెడ్డి, హేమంత్, సాయితేజ, సందీప్, శ్రీకాంత్, అజయ్, రాజు, ప్రవీణ్, సాయిచందు, పవన్, బాలకృష్ణ రెడ్డి, విష్ణు, అభిషేక్, రాజేష్, వినయ్ కుమార్, విక్రమ్, శివ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story