ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ నేతలు

by Sridhar Babu |
ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ నేతలు
X

దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శుక్రవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి బయలుదేరారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అనూహ్యంగా ఏబీవీపీ కార్యకర్తలు కాన్వాయ్‌కు అడ్డంగా దూసుకొచ్చాడు. నిరుద్యోగులకు భృతి కల్పించడంతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. గమనించిన టీఆర్ఎస్ నేతలు వారిని పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి పడిపోగా ఆసుపత్రికి తరలించారు.

ఊహించని ట్విస్ట్

ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల అంచనాలు తలకిందులు చేశారు. మంత్రి టూర్‌లో ఏబీవీపీ ఆందోళన చేస్తుందని సమాచారం అందుకున్న పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చేపట్టారు. అయితే ఏబీవీపీ ఆందోళన వేరోచోట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావించారు. ఈ మేరకు ఏబీవీపీ కార్యకర్తలు కూడా లీకులు ఇచ్చారు. దీంతో పోలీసులు మంత్రి వెంట బందోబస్తు చేపట్టారు. కానీ ఉహించని విధాంగా అంబేద్కర్ చౌరస్తాలో ఒక్కసారిగా దూసుకొచ్చి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వారికి చెదరగొట్టారు.

Advertisement

Next Story