- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నోరూరిస్తున్న ‘లిటిల్ మూన్స్’
దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్‌లో ఎప్పుడూ ఏదో ఒక ‘ఫుడ్ రెసిపీ’ లేదా ఫుడ్ ఐటెమ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. డాల్గోనా కాఫీ, టీ బాంబ్, సునామీ కేక్ నుంచి చాక్లెట్ బిర్యానీ వరకు ఇటీవలి కాలంలో కొన్ని విచిత్రమైన ఫుడీస్‌తో పాటు అదిరిపోయే టేస్టీ ఫుడ్స్ నెట్టింట్లో ఊరించాయి. ఈ విధంగా ఫుడ్ లవర్స్ తమ ఎక్స్‌పరిమెంట్స్ కొనసాగిస్తుండగా, సోషల్ మీడియాలో మరో సూపర్ ఫుడ్ ‘హ్యష్‌ట్యాగ్ లిటిల్ మూన్స్’ పేరుతో ట్రెండింగ్‌లో చేరింది. ఆ ఫుడ్ పేరు ‘లిటిల్ మూన్స్’ అని వేరే చెప్పాలా? ఆ స్వీట్ ఐస్‌క్రీమ్ కథేంటో తెలుసుకుందాం.
‘లిటిల్ మూన్స్’ అనేది ఒక పురాతన జపనీస్ డెజర్ట్. ‘హ్యష్‌ట్యాగ్ లిటిల్ మూన్స్’ కారణంగా ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చేరువైంది. ఐస్‌క్రీం, మోచితో కలిపి ఈ రౌండ్ బాల్ డిజర్ట్ చేస్తారు. ఇది జపనీస్ సాంప్రదాయ ‘స్టీమ్డ్ రైస్ కేక్’. మోచిని సాధారణంగా చక్కెర, కార్న్ స్టార్చ్ కలిపి బియ్యంతో తయారు చేస్తారు. ఇవి అందమైన రంగుల్లో చిన్నచిన్న గుండ్రని బంతుల్లా భలే అందంగా ఉంటాయి. చూడ్డానికి పున్నమి చంద్రుడిలా ఉంటాయి కాబట్టే వీటిని ‘లిటిల్ మూన్స్’ అని పిలుస్తారు. మోచీ ఐస్‌క్రీం లేదా డిజర్ట్‌ను చాక్లెట్, కొబ్బరి, మామిడి, గ్రీన్ టీ, వెనిల్లా, పిస్తా, మచ్చా వంటి వివిధ రుచుల్లో తయారు చేయొచ్చు. ఈ చిట్టి చంద్రుళ్లు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ ఐటెమ్స్ కావడంతో పాటు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్‌ను కలిగి ఉండవు. జపాన్‌లో కాకుండా ‘లిటిల్ మూన్స్’ ఇప్పుడు ఐరోపాలో హాట్‌కేక్‌ల మాదిరిగా అమ్ముడవుతున్నాయి.
‘టిక్‌టాక్ వల్ల లిటిల్ మూన్స్‌ను వేటాడే పనిలో పడ్డాను. ఎన్నో వారాలుగా వీటి గురించి సెర్చ్ చేశాను. చివరకు వాటిని విక్రయించే జపనీస్ సూపర్ మార్కెట్‌ను కనుగొన్నాను !! మేము 6 విభిన్న రుచులను ప్రయత్నించాం. మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉన్నాయి. సో టేస్టీ’ అని ఓ యూకే నెటిజన్ కామెంట్ చేశాడు. ‘హ !!!! నేను నమ్మలేకపోతున్నాను, చివరికి ఈ లిటిల్ బాల్స్ నా చేతుల్లోకి వచ్చాయి, వాటిని చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తోంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.