హోలి తెచ్చిన విషాదం

by Sumithra |   ( Updated:2021-03-28 05:23:53.0  )
హోలి తెచ్చిన విషాదం
X

దిశ,మణుగూరు : హోలి పండగ ఓ కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. స్నేహితులతో ఆనందంగా హోలి పండగ జరుపుకుని అనంతరం గోదావరి నది స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలోని చింతిర్యాలగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. చింతిర్యాలగూడెంకు చెందిన కొందరు యువతులు హోళి ఆడుకొని కొందరు యువకులు గోదావరి నది స్నానానికి వెళ్లారు. అందరూ దిగి స్నానాలు చేస్తుండగా సవలం జంపయ్య అనే యువకుడు కొంచెం లోతుగా వెళ్లి ఈతకొడుతూ మృతిచెందినట్టుగా తోటి స్నేహితులు తెలిపారు. అయితే గతంలో కూడా చింత్రియాల గోదావరికి స్థానాలకు వెళ్ళి ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని, యువకులకి గోదావరిలో సరైన లోతు తెలియక మృత్యువాత పడుతున్నారని ప్రజలు అంటున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

Advertisement

Next Story