‘అయ్యా బాంఛన్’.. TRS ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్న మహిళ..

by Sridhar Babu |
Mla-Rasamai-balakishan
X

దిశ, మానకొండూరు : అయ్యా బాంఛన్.. నాకు తిండికి లేక అల్లాడుతున్నా.. ప్రభుత్వం అందించే పెన్షన్ రావడం లేదు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడి ఓ మహిళ తన గొడువేళ్లబోసుకుంది. వివరాల ప్రకారం.. మంగళవారం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బాలకిషన్ వచ్చారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మోరె ఎల్లమ్మ తనకు ఎలాంటి స్థిరచరాస్తులు లేవని నిరుపేద దళిత కుటుంబానికి చెందినట్టు పేర్కొంది. తన భర్త చనిపోయి ఏళ్లు గడిచినా ప్రభుత్వం అందించే వితంతు పెన్షన్, ఆసరా పెన్షన్ సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా స్పందించి నా కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకొంది.

rasamai-Balakishan

Advertisement

Next Story