వైసీపీ నేత కోసం భర్తకు విషం

by Anukaran |
వైసీపీ నేత కోసం భర్తకు విషం
X

దిశ, వెబ్‌డెస్క్: అడిగేవాళ్లు లేరని అడ్డదారి తొక్కింది కాక.. ఓ అమాయకుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రియుడి మోజులో ప్రియురాలు తన భర్తకు భోజనంలో విషం పెట్టి హత్య చేయించేందుకు ప్లాన్ చేసింది. ఇది గమనించిన బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మర్డర్ ప్లాన్‌కు కుట్ర చేసిన వైసీపీ స్థానిక లీడర్, ప్రియురాలు కటకటాల పాలయ్యారు.

తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన పడాల సతీష్ స్థానికంగా వైసీపీ నాయకుడు. అయితే, ఇదే ప్రాంతానికి చెందిన కుమారి అనే వివాహితతో సతీష్‌కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, తరచూ వీరు కలుసుకునే వారు. వీరి మధ్య గల సంబంధం కుమారి భర్తకు తెలిసిపోయింది. దీంతో ఓ రోజు సతీష్‌ను ప్రశ్నించడంతో తిరిగి దాడి చేశాడు.

ప్రియుడిని కలిసేందుకు భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తప్పించాలని ఇద్దరూ ప్లాన్ వేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం.. తన భర్తకు విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చింది. విష ప్రయోగాన్ని గ్రహించిన బాధితుడు నేరుగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన భార్యతో కలిసి వైసీపీ లీడర్ పడాల సతీష్ ప్లాన్ చేశారని ఫిర్యాదులో స్పష్టం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story