నీరవ్ మోడీకి షాక్.. యూకే కోర్టు సంచలన తీర్పు

by Shamantha N |   ( Updated:2021-02-25 06:26:11.0  )
Nirav Modi
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ను రూ. 14 వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు గురువారం తీర్పు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో భారత ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలు అన్నీ సరైనవే అని చెబుతూ, నీరవ్ మోదీ ఆరోగ్య పరిస్థి సరిగా లేదనే వాదనను కొట్టేసింది. బ్యాంకు అధికారులతో ఉన్న సంబంధాలను ధృవీకరిస్తూ, బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులను మోసం చేసినట్టు రుజువైందని వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి శామ్యూల్‌ తీర్పు ఇచ్చారు. తన మానసిక స్థితి బాగోలేదని, భారత్‌కు వెళ్తే తనకు న్యాయం జరగదని నీరవ్ మోదీ వాదనలను కోర్టు కొట్టేసింది. భారత్‌కు అప్పగించినంత మాత్రాన అన్యాయం ఏం జరగదని, భారత ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలు సరిపోతాయని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ అభియోగాలు రుజువు కావడంతో నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగుమం అయింది. దీంతో త్వరలో నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురానున్నారు.

Advertisement

Next Story

Most Viewed