బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

by srinivas |

దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా చందర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. బావిలో పడి ఆరేండ్ల బాలుడు యశ్వంత్ మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడు యశ్వంత్ బావి వద్దకు వెళ్లి, అందులో పడిపోయాడు. కుమారుడు ఎంత సేపటికీ ఇంట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల కళ్లలో నీళ్లు తెప్పించింది.

Advertisement

Next Story