- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీధి కుక్కల నియంత్రణకు పైలట్ ప్రాజెక్ట్
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు వంద శాతం కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్‌తో పాటు యాంటి రాబిస్ వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ తెలిపారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ పైలెట్ ప్రాజెక్ట్ ఆగష్టు 15వరకు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఐదు యానిమల్ కేర్ సెంటర్లలో ప్రతి సెంటర్ నుంచి ఒక వార్డును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఫతుల్లాగూడ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని హయత్‌నగర్ సర్కిల్‌లో నాగోల్-11 వార్డును, చుడీబజార్ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని చార్మినార్ సర్కిల్‌లో ఉన్న శాలిబండ-48 వార్డును, పటేల్‌నగర్ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్‌లో ఉన్న అసీఫ్‌నగర్-72 వార్డును, కె.పి.హెచ్.బి కాలనీ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఉన్న శేరిలింగంపల్లి-106 వార్డును, మహదేవ్‌పూర్ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలో ఉన్న గాజులరామారం సర్కిల్‌లోని గాజులరామారం -125 వార్డులలో ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు వార్డుల్లో దాదాపు 20వేల వీధి కుక్కలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు 1,179 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్, 2,016 వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు.