- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుతో తిరిగొచ్చిన పిల్లి
దిశ, వెబ్‌డెస్క్ : థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎప్పటి నుంచో ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే, మూడు రోజుల క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయిన ఆ పిల్లి.. మళ్లీ ఎలాగోలా ఇంటికి తిరిగొచ్చింది. కానీ అప్పు చేసి మరీ రావడం విశేషం. పిల్లి అప్పు చేయడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏం జరిగింది?
అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లి.. మూడు రోజుల పాటు కనిపించకుండా పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ సిచ్యువేషన్‌లో అది క్షేమంగా ఇంటికి తిరిగొస్తే ఆనందంతో ఉప్పొంగిపోవాలి కదా! కానీ, ఆ పిల్లిని పెంచుకున్న వ్యక్తి మాత్రం షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే.. దాని మెడలో ‘మీ పిల్లి మా షాపులోని మాకెరల్స్(తినుబండారం)పై కన్నేసింది. దీంతో నేను దానికి ఓ మూడు మాకెరల్స్ ఇచ్చాను’ అని రాసి ఉన్న ఓ ట్యాగ్ ఉంది. ఆంటీ మే అనే మహిళ.. పిల్లికి ఆ ట్యాగ్‌ను తగిలించి దాని మీద తన సైన్ చేయడంతో పాటు అడ్రస్ కూడా రాసింది. అలా పిల్లి ఆంటీ మేకు రుణపడింది. దాంతో ఆ పిల్లి అప్పు గాథను.. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ఓ పిల్లి మూడు రోజులు కనిపించకుండా పోయింది. అప్పులతో తిరిగొచ్చింది’ ఈ ట్యాగ్ లైన్ ఎలా ఉంది? అంటూ షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది.