విలువైన ఓ పెయింటింగ్..మూడు సార్లు చోరీ!

by Shyam |
విలువైన ఓ పెయింటింగ్..మూడు సార్లు చోరీ!
X

దిశ, వెబ్ డెస్క్: విలువైన పెయింటింగ్‌లు మ్యూజియాల నుంచి చోరీకి గురై, బ్లాక్ మార్కెట్‌లో ప్రత్యక్షమవడం మనం చూస్తూనే ఉంటాం. ఒకసారి చోరికి గురయ్యాక దాన్ని పూర్తిగా సురక్షితంగా ఉంచుతారు. కొంచెం ఎక్కువ భద్రత కల్పిస్తారు. కానీ, ఫ్రాన్స్హాల్స్ వేసిన ఒక పెయింటింగ్ ఉంది. దాని పేరు టు లాఫింగ్ బాయ్స్. ఇద్దరు నవ్వుతున్న అబ్బాయిల ఉన్న ఈ పెయింటింగ్ ఎంత కట్టుదిట్టంగా భద్రతను కల్పించినా చోరీకి గురవుతూనే ఉంది. ఇప్పటికే రెండు సార్లు వేర్వేరు మ్యూజియాల నుంచి చోరీకి గురైన ఈ పెయింటింగ్‌ను ఇటీవల మూడోసారి ఎవరో కొట్టేశారు.

నెదర్లాండ్‌లోని లీర్దామ్ సిటీలో హోఫ్జే వాన్ ఆర్డెన్ మ్యూజియం నుంచి ఈ పెయింటింగ్‌ను బుధవారం దొంగలు ఎత్తుకెళ్లారు. 1988లో మొదటిసారిగా ఈ పెయింటింగ్‌ను దొంగిలించారు. మళ్లీ అది 1991లో దొరికింది. మళ్లీ సరిగ్గా 20 ఏండ్లకు అంటే 2011లో మళ్లీ ఈ పెయింటింగ్‌ను దొంగతనం చేశారు. అప్పుడు ఆరు నెలలు కనిపించకుండా పోయింది. ఇప్పుడు భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఇలా మరోసారి చోరీకి గురవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఈ పెయింటింగ్‌కు ఎందుకు ఇంత క్రేజు అనుకుంటున్నారా? ఎందుకంటే దీని విలువ 15 మిలియన్ పౌండ్లు. అంటే భారత కరెన్సీలో రూ. 131 కోట్లు అన్నమాట.

Advertisement

Next Story

Most Viewed