వైద్యం కోసం 125 కిలోమీటర్లు సైకిల్‌పై..

by  |

భార్య క్యాన్సర్‌తో బాధపడుతుంటే భర్త తట్టుకోలేకపోయాడు. అసలే లాక్‌డౌన్ కారణంగా బస్సులు తిరగడం లేదు. ఎట్లాగైనా తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లానికి నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవు 65 ఏళ్ల వయస్సులో తన భార్యను సైకిల్‌పై 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. ఈ ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. రైతు చేసిన ఈ సహసానికి వైద్యులు నోరెళ్లబెట్టారు. తన భార్యపై ఉన్న మమకారమే వల్లే ఇంత దూరం సైకిల్‌పై తీసుకొచ్చానని రైతు అన్నాడు. వివరాలు ఇలా..
తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన రైతు అరివలగన్ (65). తన భార్య మంజుల (60) క్యాన్సర్ తో భాదపడుతుంది. ఆమెకు పుదచ్చేరిలోని జిప్మర్‌లో వైద్యం చేయిస్తున్నాడు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో భాగంగా ఆమెకు తరుచు కీమో థెరపీ చికిత్స చేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎలాంటి వాహనాలు తిరగడం లేదు. ఒక్క వైపు భార్య ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. దీంతో రైతు అరివలగన్ మంగళవారం కుంభకోణంలో తన భార్యను సైకిల్‌పై ఎక్కించుకొని పుదుచ్చేరికి పయణమయ్యాడు. ఒక రోజంతా సైకిల్ పై ప్రయాణించి ఎట్టకేలకు బుధవారం నాటికి పుదచ్చేరిలోని జిప్మర్‌కు చేరుకున్నాడు.దారి మధ్యలో పోలీసులు ఆపినా వెంట తెచ్చుకున్న మెడికల్ రిపోర్టులను చూపించడంతో ప్రయాణం సాఫీగా సాగింది. తన భార్య‌ను సైకిల్‌పై జిప్మర్‌కు తీసుకొచ్చిన అరివలగన్‌ను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే మంజులకు వైద్యులు కీమోథెరపీ చేయించారు. గురువారం సాయంత్రం ఈ జంటను వైద్యులు స్వయంగా అంబులెన్స్‌లో ఎక్కించి తిరిగి కుంభకోణానికి పంపించారు.

Tags: old couples, cancer, tamil nadu, puducherry, jipmer

Advertisement

Next Story