విషాదం.. ఆర్పేందుకు వెళ్లి మంటల్లో చిక్కి మృతిచెందాడు

by Shyam |
విషాదం.. ఆర్పేందుకు వెళ్లి మంటల్లో చిక్కి మృతిచెందాడు
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన చిల్లర చేష్టలకు ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైపోయింది. విషయమేమిటంటే.. జిల్లాలోని సారంపల్లిలో వరిగడ్డి కుప్పలకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఇది గమనించిన పోలు నాగభూషణం(55).. అక్కడికి వెళ్లి ఆ మంటలను అదుపు చేస్తున్న క్రమంలో అతను కూడా మంటల్లో చిక్కి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.

Advertisement

Next Story