- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
12 ఏళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్న వితంతుడు..!
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ అధికారులు ఏ పాటి నిబద్ధతో పని చేస్తారో చిన్న పిల్లవాడిని అడిగిన చెబుతారు. వారి నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. మాములుగా అయితే వితంతు పెన్షన్ అంటే భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు ఇస్తుంటారు. అయితే అధికారులు చూసి చూడకుండా ఓ పురుషుడి దరఖాస్తును ఆమోదించడంతో ఆ వ్యక్తి 12 ఏళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్నాడు.
అసలు సంగతేంటంటే.. కర్నూలు జిల్లా డోన్ మండలానికి చెందిన కాశీం అనే వ్యక్తి 2009 సంవత్సరం నుండి అంటే దాదాపు 12 ఏళ్ళ నుండి ప్రతి నెల వితంతు పింఛను తీసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది అయితే కాశీం కొన్ని రోజుల క్రితం ఉపాధి నిమిత్తం గుంటూరు జిల్లాకు వెళ్లాడు. ఈ ఏప్రిల్ నెల మొదటివారంలో వినుకొండ మండలం చిట్టాపురంలో వితంతు పెన్షన్ కోసం అధికారుల వద్దకు వెళ్లాగా.. పురుషుడివి… నీకు వితంతు పెన్షన్ ఎలా వస్తుంది..? అని అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఈ నేపథ్యంలో చిట్టాపురం అధికారులు డోన్ మండలం అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే విచారణ చేపట్టారు.