ఫ్లాష్.. ఫ్లాష్.. దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు

by Sumithra |   ( Updated:2023-02-04 11:53:22.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. ఈ విచారణలోనే నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. దర్భంగా పేలుడు కేసులో సూత్రధారి సలీమ్ అని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. సలీమ్ యూపీ నుండి ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్‌లోని ఇమ్రాన్, నాసిర్‌లతో రోజుల తరబడి భేటీ అయిన సలీమ్, ఐఈడీ బాంబుల తయారీలో ఇమ్రాన్, నాసిర్ లకు శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలో నడుస్తున్న ట్రైన్‌లో బాంబులు పేల్చాలని కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దర్భంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని రెండు బోగీలను పేల్చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

పాకిస్థాన్ లష్కరే తోయిబాతో హజీ సలీమ్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అంతేకాకుండా ఎల్‌ఈటీ ఆపరేటర్ ఇక్బాల్ ఖన్నాతో లింకులు ఉన్నట్లు, పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టానికి ఇక్బాల్ ఖన్నా, హజీ సలీమ్ లు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తెలిపింది. వీటి నిమిత్తం పాకిస్థాన్ నుండి నిధులు తెప్పించినట్టుగా కూడా ఎన్ఐఏ పేర్కొంది. సలీమ్ కోడ్ బాషలో నాసిర్ సోదరులతో మాట్లాడినట్లు ఆధారాలు లభించడంతో, ఎన్ఐఏ ఈ కోడ్ భాషను డీకోడ్ చేసే పని పడింది. కోడ్ బాషను డీకోడ్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed