- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు రూ.740 కోట్ల భారీ పెట్టుబడి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి భారీ పెట్టుబడుల విలువ కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన చేసింది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ సుమారు సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం మేర ల్యాబ్ స్పేస్‌లో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది.
ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ ఇండియా ఎండీ చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సీన్హా వంటి సంస్థ సీనియర్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో వర్చువల్ పద్దతిలో సమావేశం నిర్వహించారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న ఎంఎన్ పార్క్ లో పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఒక ప్రముఖ కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో మొదటిసారిగా లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇవాన్ హో(Ivanhoé)కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ద్వారా లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందన్నారు. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రంగ పరిశోధన మరియు అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, తాజాగా ఈ పెట్టుబడితో ప్రభుత్వం యొక్క లైఫ్ సైన్సెస్ రంగ ఫోకస్ కు ఊతం లభిస్తుందన్నారు.
ఈ పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో మరింత లాబరేటరీ స్పేస్ పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ అనుబంధ మౌలిక వసతులు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ పెట్టుబడికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ ఇండియా ఎండీ చాణక్య చక్రవర్తి మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీలో ఉన్న ఎంయన్ పార్క్ లో తమ సంస్థ పెడుతున్న 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌తో పాటు దేశం ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.