- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బు కట్టు.. శవాన్ని ముట్టు..ఓ హస్పిటల్ నిర్వాకం..!
దిశ, నల్లగొండ: కరోనాతో చికిత్స పొంది మరణించాక కూడా, నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకులు డబ్బుచెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటున్నారని బాధిత బంధువులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన కొండ శ్రీకాంత్ కరోనా లక్షణాలతో నల్లగొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యం అందించే సమయంలో రూ.1.40 లక్షలు ముందుగానే ఆసుపత్రి నిర్వాహకులకు చెల్లించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శ్రీకాంత్(29) ఆదివారం మృతిచెందాడు. బంధువులు మృతదేహాన్ని తీసుకుపోవడానికి సిద్ధపడగా, మరో రూ.1లక్ష కడితేనే మృతదేహాన్ని అప్పజెప్పుతామని ఆసుపత్రి నిర్వాహకులు తెగేసి చెప్పారు.
చేసేందేంలేక తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు తమ గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే ఆయన స్పందించి ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, డబ్బుకడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని సాక్షాత్తు ఎమ్మెల్యే ముఖం మీదనే చెప్పినట్లు సమాచారం. బాధితులు మరో రూ.50వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా, పూర్తి డబ్బు కట్టాల్సిందేనని ఆసుపత్రి సిబ్బంది తేగేసిచెబుతున్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలో బంధువులు ఆసుపత్రి ఎదుటనే ఉన్నారు.