శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో మంటలు..

by Shamantha N |   ( Updated:2021-03-13 03:42:22.0  )
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో మంటలు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని సి-4 కంపార్ట్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపంలో జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులందరినీ బోగి నుండి సురక్షితంగా తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు సంభవించలేదని అన్నారు.

Advertisement

Next Story