మరో అమృత- ప్రణయ్ తరహా ఘటన.. కూతురిని ప్రేమించాడని అతి దారుణంగా

by Anukaran |   ( Updated:2021-05-28 02:48:56.0  )
మరో అమృత- ప్రణయ్ తరహా ఘటన.. కూతురిని ప్రేమించాడని అతి దారుణంగా
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో దారుణం చోటుచేసుకుంది. కూతురిని ప్రేమించాడనే కారణంతో యువకుడిని యువతి తండ్రి ఘోరంగా నరికిచంపాడు. మాట్లాడాలని పిలిచి యువకుడిని ముక్కలు ముక్కలుగా నిరికి చంపేశాడు కీచక తండ్రి. ముక్కలు చేసి పాతిపెట్టగా.. నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్- శైలజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా ధనశేఖర్ కనిపించకపోవడంతో.. అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చివరిగా శైలజ తండ్రి ధనశేఖర్‌కు ఫోన్ చేసినట్లు నిర్ధారణ అయింది. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి కేసును చేధించారు.

మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. తన కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ప్రణయ్‌ను యువతి తండ్రి మారుతీరావు దారుణంగా హత్య చేయించాడు. ఈ తరహాలోనే చిత్తూరు జిల్లా ఘటన ఉందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story