- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంధాన్ని బలపరిచే.. ఇట్ టేక్స్ టు
దిశ, ఫీచర్స్ : మూడుముళ్లు, ఏడడుగులతో ముడిపడ్డ బంధం కలకాలం హాయిగా సాగాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. కానీ నేటితరం పెళ్లిళ్లలో చాలా వరకు మూడు కాలాలైనా నిలవడం లేదు. అహంకారమో, ఆధిపత్యమో తెలియని చిన్న చిన్న కారణాలతో దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. ఏ రెండు వేలిముద్రలు ఒకేలా ఉండవన్నది ఎంత నిజమో.. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకే అభిప్రాయం, ఆలోచనతో ఉండరన్నది అంతే సత్యం. ఒకరు కోపంతో అరుస్తుంటే.. మరొకరు శాంతంగా ఉండాలి. ఒకరు పొరబడితే మరొకరు సర్దిచెప్పాలి. ఇరువురి అభిప్రాయాలు, భావాలను పరస్పరం గౌరవించుకున్నప్పుడే ఆనందకరమైన జీవితం సొంతమవుతుంది. కానీ ఎంతోమంది భార్యభర్తల విషయంలో ఇలా జరగడం లేదు. ‘రోస్’ తల్లిదండ్రులు విషయంలోనూ ఇదే జరిగింది. ఇంతకీ రోస్ ఎవరనుకుంటున్నారా? ‘కోడి అండ్ మే’ల కూతురు. వీళ్లంతా ‘ఇట్ టేక్స్ టు’ అనే గేమ్‌లో ప్లేయర్స్. అయితే తల్లిదండ్రులు విడిపోవడం ఇష్టంలేని రోస్.. వారిద్దరినీ కలపడానికి ఏం చేసింది? వారికి ఎలాంటి కౌన్సెలింగ్ ఇచ్చిందనేదే ‘ఇట్ టేక్స్ టు’ గేమ్. వైవాహిక సమస్యలను సున్నితంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఈ కపుల్ థెరపీ గేమ్ గురించి మీకోసం..
హెజలైట్ స్టూడియోస్ అభివృద్ధి చేసిన కొత్త కో-ఆప్ మల్టీప్లేయర్ గేమ్ ‘ఇట్ టేక్స్ టు’. ఐజీఎన్, ఎన్‌ఎమ్ఈ నివేదికల ప్రకారం.. ప్లేయర్స్ తమ గేమ్ ఫినిష్ చేసేందుకు సుమారు 16-20 గంటల సమయం పడుతుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇద్దరు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఇక ‘ఇట్ టేక్స్ టు’ తన ఆటగాళ్లకు తొమ్మిది వేర్వేరు ప్రపంచాలను పరిచయం చేస్తుంది. ఈ ఆటలోని ప్రధాన పాత్రధారులైన ‘కోడి, మే’ల వైవాహిక బంధాన్ని కాపాడే ప్రయత్నంగానే ఈ గేమ్ సాగుతుంది.
కథ ఏంటంటే?
భార్యాభర్తలైన ‘కోడి, మే’ ప్రేమకు ప్రతిరూపమే ‘రోస్’. అయితే ఒక దశలో ఈ దంపతులిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి. ‘మే’ ఎంతగా పనిచేసినా.. కోడి ఒక్కసారి కూడా ప్రశంసించకపోవడంతో పాటు పని విషయంలో నిత్యం తగువులాడుకునేవారు. చివరకు కలిసి ఉండలేమని నిశ్చయించుకుని ఆ విషయాన్ని కూతురు ‘రోస్’కు చెబుతారు. కానీ వాళ్లిద్దరూ విడిపోవడం ఇష్టంలేని రోస్.. తల్లిదండ్రుల రూపంలో తను తయారు చేసిన బొమ్మల ముందర ఏడుస్తుంది. ఆమె కన్నీరు ఆ బొమ్మలపై పడగానే.. ఒక్కసారిగా ఏదో మ్యాజిక్ జరిగి ‘కోడి, మే’ కూడా నిజంగా బొమ్మల్లానే మారిపోతారు. ఈ క్రమంలో పుస్తక రూపంలో (పుస్తకం పేరు బుక్ ఆఫ్ లవ్) ఉండే మ్యారేజ్ కౌన్సెలర్ డాక్టర్ హకీమ్ వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. మొత్తానికి ఈ జంటను తమ కుమార్తె దగ్గరకు చేర్చేందుకు అనేక సవాళ్ళను వాళ్ల ముందుంచుతాడు. ఎన్నో సంవత్సరాలుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న ద్వేషం కాస్త.. ఈ ప్రయాణంలో సయోధ్యగా మారడంతో ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రేమించుకుంటారు.
పేరు(‘ఇట్ టేక్స్ టు’)కు తగ్గట్లే.. ఇది ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఆడాల్సిన అడ్వెంచరస్ యాక్షన్ గేమ్. అన్ని సమయాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ రిమోట్‌గానూ ఆడొచ్చు. ఆ సమయంలో గేమ్ రెండు స్క్రీన్‌లుగా విడిపోతుంది. ఉదాహరణకు.. ఒక స్థాయిలో ఓ ఆటగాడు గోడపై మేకులు కొట్టాలి. మరో ఆటగాడు సుత్తి లాంటి సాధనాన్ని ఉపయోగించి ఆ మేకుల గుండా దూకి మొదటి ఆటగాడి కోసం తలుపును అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ గేమ్ ఇలాంటి అనేక సవాళ్లను విసురుతుంది. బాల్యాన్ని గుర్తుచేసే పజిల్స్‌తో పాటు ఆపద సమయాల్లో ఎలాంటి ఉపాయాలతో బయటపడతారనే టాస్క్‌లు ఆసక్తిని కలిగిస్తాయి. జాయిన్-ది-డాట్స్‌తో సహా గణిత, జ్ఞాపకశక్తి-ఆధారిత సవాళ్లు ఆటగాళ్ల మెదడుకు పదును పెడతాయి.
ఇట్ టేక్స్ టు అనేది.. ఉత్సాహం, విచారం, ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని అందించే అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్. ఇది కేవలం ఆట అని ప్రజలు చెప్పినప్పటికీ, దాని కథ గేమ్‌ప్లేతో ఎంతో లోతైన, విలువైన సందేశాన్ని అందిస్తుంది. ఇద్దరు ఆటగాళ్ళు వేర్వేరుగా ప్రత్యేకమైన అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటారు, అయినప్పటికీ వారు కలిసి సవాళ్లను అధిగమించడం ద్వారా మరింత పురోగతి సాధిస్తారు. ప్రతి స్థాయి ఆటగాడికి ఇది ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుంది. ఈ బలాలు ఎదుటివారి బలహీనతను అధిగమించి ముందుకు సాగడానికి సాయపడతాయి. ఫైనల్లీ ‘ఇట్ టేక్స్ టు’ అనేది ఊహించదగిన కథాంశమే అయినప్పటికీ ఇంటెన్స్ విజువల్స్, ఆటలోని పజిల్స్ ఆ లోటును భర్తీ చేసి అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. భాగస్వామితో కలిసి ఆడితే ఫుల్‌గా ఎంజాయ్ చేయడంతో పాటు ఇద్దరు కలిసి ఉంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో తెలుసుకుంటారు. ఈ గేమ్‌ను సింగిల్స్ కూడా ఆడొచ్చు. కానీ వారితో ఆడాలనుకునే మరొక ఆటగాడు తప్పనిసరి. మార్చి 2021లో విడుదలైన ‘ఇట్ టేక్స్ టు’ పీసీ(PC), ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్(Xbox)లో అందుబాటులో ఉంది.