మరియమ్మ లాకప్‌ డెత్.. పోలీసులపై కేసు నమోదు

by Sumithra |   ( Updated:2021-07-12 12:10:24.0  )
addaguduru-ps
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన పోలీసులపై ఉన్నతాధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఎస్సై మహేశ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయగా.. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ కమీషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story