నిజామాబాద్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

by Shyam |
నిజామాబాద్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
X

దిశ, నిజామాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలు చేయడం టీఎన్జీవోస్‌కు కొత్త కాదని, ఉద్యమంలో వీరి భూమిక ఎంతో గొప్పదని ఈ విషయం సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు గుర్తు చేశారన్నారు. టీఎన్జీవోస్ అంటే ప్రభుత్వంలో భాగమన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, సీఎం మనసులో రచించుకున్న అనేక పథకాలు అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేస్తున్నారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed