Rain alert: ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్.. దంచి కొట్టనున్న భారీ వర్షాలు

by Mahesh |
Rain alert: ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్.. దంచి కొట్టనున్న భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉపరితల ఆవర్తనం(Surface periodicity) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ(Weather department) అంచనా వేసింది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఉమ్మడి వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అకాల వర్షం దంచి కొట్టింది. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం నల్లగొండ, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather department) అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి నల్లగొండ జిల్లాలోని అనేక మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కెట్లలో పత్తి, వరి పంటలు తడిసిపోవడంతో రైతులు ఏం చేయాలో తెలియక, తడిసిన పంటను కొంటారా లేదో ఆనే ఆవేదనలో పడిపోయారు.

Advertisement

Next Story