- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain Alert: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలో ఐఎండీ అధికారులు (IMD Officials) ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు.
అక్టోబరు 5 నుంచి అక్టోబర్ 6 వరకు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలలు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) హెచ్చరికలు జారీ చేసింది.