బిగ్ న్యూస్: సీఎం KCR షాకింగ్ డెసిషన్.. ఆ 12 మంది సిట్టింగ్‌లకు టికెట్ కట్..?

by Satheesh |
బిగ్ న్యూస్: సీఎం KCR షాకింగ్ డెసిషన్.. ఆ 12 మంది సిట్టింగ్‌లకు టికెట్ కట్..?
X

బీఆర్ఎస్‌లో ఉంటూ ఇతర పార్టీల వైపు చూస్తున్న అసంతృప్త నేతలకు చెక్ పెట్టేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారు. జూలై లేదా ఆగస్టులో అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు 30 మందికి ఈ సారి టికెట్ వచ్చే చాన్స్ లేదంటూ ముందు నుంచే ప్రచారం జరుగుతున్నది. అందులో సుమారు డజను మంది సిట్టింగులు బీజేపీ, కాంగ్రెస్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నట్టు గ్రహించిన కేసీఆర్.. వారిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు సిద్ధమయ్యారని, వారి స్థానంలో కొత్త వారిని అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్ లిస్టు రెడీ చేశారని టాక్.

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుగానే సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్టును సిద్ధం చేసినట్టు తెలిసింది. శ్రావణ మాసంలో ఈ జాబితాను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. పార్టీలో కొనసాగుతున్న అసమ్మతి నేతలకు ఈ లిస్టుతో చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్టు టాక్.

పలు సెగ్మంట్లలో టికెట్లు ఆశిస్తున్న లీడర్లు తమకు టికెట్ వస్తుందో లేదోనని అనుమానంతో రహస్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో టచ్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ వారికి షాకిచ్చేలా నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నదని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.

90 శాతం ఎంపిక పూర్తి..?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లకు సంబంధించిన విషయంపై కసరత్తు చేస్తున్న గులాబీ బాస్.. ఇప్పటికే 90 శాతం మంది అభ్యర్థులను ఖరారు చేశారని ప్రగతిభవన్‌కు సన్నితంగా ఉండే లీడర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆషాడమాసం కొనసాగుతున్నందునా మంచి ముహూర్తం కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. శ్రావణమాసంలో అంటే జూలై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

గోడ దూకే లీడర్లకు ఝలక్

ఈసారి సుమారు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రాదనే ప్రచారం జరుగుతున్నది. దీంతో హైకమాండ్ నుంచి అలాంటి సంకేతాలు అందుకున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్, బీజేపీ‌తో టచ్‌లో ఉంటున్నారని సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ అలాంటి వారిని సాధ్యమైనంత త్వరగా పార్టీ నుంచి బయటకు పంపేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. వారికి ఝలక్ ఇచ్చేందుకు వారి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులతో ఫస్టు లిస్టును ప్రకటించే చాన్స్ ఉన్నదని బీఆర్ఎస్‌కు చెందిన ఓ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు.

రహస్య మంతనాలపై యాక్షన్

ఈ సారి తమకు టికెట్ వస్తుందో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్న వారిలో సుమారు డజను మంది సిట్టింగులు ప్రత్యామ్నాయం వైపు మళ్లుతున్నారు. ఓ వైపు బీఆర్ఎస్‌లో కొనసాగుతూనే కాంగ్రెస్‌ పార్టీతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు టాక్. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కొందరు సిట్టింగులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకూ టికెట్ కావాలని హైకమాండ్‌ను కోరినట్టు టాక్.

కానీ ఒక్కో కుటుంబానికి ఒకే టికెట్ అంటూ కేసీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో కొందరు లీడర్లు ఇతర పార్టీలో తమ వారసుల టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు, తమ వారసులకు టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామనే ప్రతిపాదనలు పెడుతున్నట్టు టాక్. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. అలాంటి వారికి ఫస్ట్ లిస్టు‌లోనే చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed