- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దిశ, సినిమా: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ది లయన్ కింగ్’(The Lion King) ప్రపంచవ్యాప్తంగా ఎంతలా ప్రేక్షాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa: The Lion King) వచ్చింది. బారీ జెంకిన్స్(Barry Jenkins) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ పెరియార్ నిర్మించారు. ఇక ఈ సారి మరింత స్పెషల్‌గా వచ్చిందనే చెప్పాలి. ముఫాసాకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇవ్వగా.. హీందీ వెర్షన్‌లో షారుక్ ఖాన్(Shahrukh Khan), ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రహం అందించారు.
ఇక ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్(Aryan Khan) వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. అయితే ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్స్‌లో విడుదల భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘ముఫాసా ది లయన్ కింగ్’ వచ్చే ఏడాది మార్చిలో హాట్ స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందపడుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
#MufasaTheLionKing OTT Release Coming For March 2025 on Hotstar
— SRS CA TV (@srs_ca_tv) December 29, 2024
In Tamil Telugu Hindi English pic.twitter.com/wQnwf1YFgL