ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటున్నా.. CM రేవంత్ రెడ్డి ప్రకటన

by GSrikanth |   ( Updated:2024-05-05 14:43:10.0  )
ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటున్నా.. CM రేవంత్ రెడ్డి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 9వ తేదీలోగా రైతు భరోసా ఇచ్చే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క గ్యారంటీ కూడా వదలిపెట్టబోమని.. అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు చేయడం లేదని కేటీఆర్ అంటున్నారు.. ఒకసారి ఆర్టీసీ బస్సు ఎక్కి చూస్తే తెలుస్తుంది.. హామీలు అమలు అవుతున్నాయో లేదో అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని రేవంత్ విమర్శించారు.

విభజన హామీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కోరితే.. గాడిద గుడ్డు చేతిలో పెట్టిందని వ్యాఖ్యానించారు. అలాంటి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దన్నారు. ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని.. దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని రేవంత్ చెప్పారు. మే 9వ తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీనాటికి ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రకటించారు.

Read More...

కేటీఆర్ చీర కట్టుకొని ఆ పని చేయు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story