కేసీఆర్‌తో మాట్లాడి ఆరేళ్లు అవుతుంది.. బీఆర్ఎస్‌లో చేరికపై బాబూ మోహన్ క్లారిటీ

by GSrikanth |
కేసీఆర్‌తో మాట్లాడి ఆరేళ్లు అవుతుంది.. బీఆర్ఎస్‌లో చేరికపై బాబూ మోహన్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని.. పార్టీకి రాజీనామా చేయడంతో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాల్క సుమన్, బాబూ మోహన్ అంటూ పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్‌లో చేరిక, వరంగల్‌ నుంచి పోటీపై ప్రముఖ నటుడు బాబూ మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించారు.

మరోసారి తాను తప్పు చేయదలుచుకోలేదని.. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరబోను అని స్పష్టం చేశారు. కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ నుంచే వరంగల్ స్థానానికి పోటీ చేస్తున్నాను అని ప్రకటించారు. ‘తాను కేసీఆర్‌తో మాట్లాడి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఇదంతా ఎవరు సృష్టించారో తెలియడం లేదు. కానీ, ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్పగలను. నన్ను ఎవరూ కొనలేరు. అలాంటి వారు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు’ అని బాబూ మోహన్ కుండబద్దలు కొట్టారు.

Advertisement

Next Story

Most Viewed