ఐపీఎల్ 2023లో ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్‌గా విరాట్

by Mahesh |
ఐపీఎల్ 2023లో ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్‌గా విరాట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ జట్టు రెండో సారి స్లో ఓవర్ రేటును నమోదు చేసుకుంది. దీంతో కోహ్లికి ₹24 లక్షల జరిమానా విధించబడింది. RCB యొక్క ప్లేయింగ్ XI మరియు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లోని ఇతర సభ్యులకు ₹6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25%, ఏది తక్కువైతే అది జరిమానా విధించబడింది. అలాగే స్లో ఓవర్ రేట్ మరోసారి కూడా జరిగితే కోహ్లిని ఒక మ్యాచ్‌కు నిషేధిస్తారు.

Advertisement

Next Story