ఐపీఎల్లో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్లు వీళ్లే..!

by Javid Pasha |
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్లు వీళ్లే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. తమ ఫేవరేట్ ప్లేయర్స్ ఆటను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మార్చి 31న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రారంభమైన ఈ సీజన్ ఐపీఎల్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ బ్రూక్ ఈ సీజన్ లో తొలి సెంచరీ చేసి జట్టుకు సూపర్ విక్టరీని అందించాడు. కాగా బ్రూక్ ఇంగ్లాండ్ కు చెందిన ప్లేయర్. ఇక ఇంగ్లాండ్ నుంచి చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడుతూ వస్తున్నారు. అయితే వారిలో ఓ ఐదుగురు మాత్రమే ఇప్పటి వరకు ఐపీఎల్ లో సెంచరీ చేశారు. వాళ్లవరంటే..?


1. కెవిన్ పీటర్సన్

ఇంగ్లాండ్ కు చెందిన పీటర్సన్ 2012 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ సీజన్ లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్కన్ చార్జర్స్ తో జరిగిన మ్యాచ్ లో పీటర్సన్ 64 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన మొదటి ఇంగ్లాండ్ ప్లేయర్ గా పీటర్సన్ రికార్డు సృష్టించాడు.


2. జానీ బెయిర్‌స్టో

ఇక ఐపీఎల్ లో సంచరీ చేసిన రెండో ఇంగ్లాండ్ బ్యాటర్ గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ఈయన 2019 సీజన్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు. బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో జానీ బెయిర్‌స్టో 56 బంతుల్లో 114 పరుగులు చేశాడు.


3. బెన్ స్టోక్స్

బెయిర్‌స్టో మరియు పీటర్సన్ తర్వాత బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ నుంచి సెంచరీ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన బెన్ స్టోక్స్.. 60 బంతుల్లోనే 107 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.


4. జోస్ బట్లర్

ఇక 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జోస్ బట్లర్.. హైదరాబాద్ సన్ రైజర్స్ పై 64 బాల్స్ లోనే 124 రన్స్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ నుంచి సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ గా బట్లర్ నిలిచాడు.


5. హ్యారీ బ్రూక్

ఇక ప్రస్తుత సీజన్ లో హ్యారీ బ్రూక్ దుమ్ములేపుతున్నాడు. శుక్రవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ తరఫున ఆడిన ఈ ఇంగ్లాండ్ ప్లేయర్.. 55 బంతుల్లో సంచరీ కొట్టి హైదరాబాద్ జట్టుకు అలవోక విజయాన్ని అందించాడు. ఇక ఈ సీజన్ లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా బ్రూక్ నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed