- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చివరి మ్యాచ్‌లో సచిన్ కుమారుడికి ఛాన్స్.. జట్టులో కీలక మార్పులు చేసిన ముంబై..!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో నాకౌట్ మ్యాచులు చివరి స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించిన ఈ రెండు టీములు ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పోటీ పడుతున్నాయి. అయితే, చెత్త ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుండి ఔట్ అయిన ముంబై.. లీగ్ చివరి మ్యాచులో జట్టులో కీలక మార్పులు చేసింది. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు జట్టులో స్థానం కల్పించింది. ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించడంతో మ్యాచును లైట్ తీసుకున్న ముంబై పల్టాన్స్ ఈ సీజన్‌లో అర్జున్ టెండూలర్క్‌కు ఫస్ట్ సారి మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది.
కాగా, అర్జున్ టెండూల్కర్ గత కొన్ని సీజన్లుగా తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ తరుఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో అర్జున్‌కు చాలా మ్యాచుల్లో ముంబై అవకాశం ఇవ్వగా.. అతడు ఆకట్టుకోలేపోయాడు. ఆల్ రౌండర్ అయిన అర్జున్ బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఎమ్ఐ అతడిని జట్టు నుండి తప్పించింది. ఇక, ఈ సీజన్‌లో ముంబై మొదటి నుండి చెత్త ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో జట్టులో అర్జున్‌కు చోటు దక్కలేదు. చివరిదైనా నామామాత్రపు మ్యాచ్‌లో చాన్స్ ఇచ్చింది. కాగా, ఈ సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన ముంబై.. కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి.. 9 గేముల్లో పరాజయం మూటగట్టుకుని లీగ్ నుండి నిష్క్రమించింది.