ఉత్కంఠ పోరులో లక్నో విజయం..

by Mahesh |
ఉత్కంఠ పోరులో లక్నో విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన 63వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. క్రునాల్ పాండ్యా 49, స్టోయినిస్ 89, తో రాణించడంతో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. మొదటి నుంచి దూకుడుగా రాణించింది. ఓపెనర్లు కిషన్ 59, రోహిత్ శర్మ 37 తో రాణించారు. అయినప్పటికి మిడిల్ ఓవర్లలో స్టార్ బ్యాటర్లంతా వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో చివరి ఓవర్ వరకు వచ్చిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే ఈ సీజన్ ప్లే రేసులో మరో ముందడుగు వేసింది.

Advertisement

Next Story