- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టిన పంజాబ్ కింగ్స్.. మూడో పోరులోనైనా సన్ రైజర్స్ బోణీ చేస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో వరుసగా రెండు ఓటములతో సన్ రైజర్స్ డీలా పడింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయంతో అభిమానులను నిరాశ పరిచింది. మరి కొన్ని గంటల్లో సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు రెడీ అయింది. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో ఆ పరాజయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. ముఖ్యంగా టాపార్డర్ తడబడుతోంది. బ్యాటర్లు ఆరంభ ఓవర్లలోనే పెవిలియన్ చేరడం కలవరపెడుతోంది.
గత పోరులో డకౌటైన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తాజా పోరులో అయినా జట్టును ముందుండి నడిపించాలి. భారీ అంచనాలున్న బ్రూక్ తడబడుతున్నాడు. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లు నెగ్గి జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టింది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ను ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. ముచ్చటగా మూడో పోరులో అయినా సన్ రైజర్స్ బోణీ చేస్తుందో లేదో చూడాలి.