’ఇంపాక్ట్ ప్లేయర్’తో బౌలర్లకే ఎక్కువ నష్టం : షాబాజ్ అహ్మద్

by Harish |
’ఇంపాక్ట్ ప్లేయర్’తో బౌలర్లకే ఎక్కువ నష్టం : షాబాజ్ అహ్మద్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్‌రౌండర్ల కంటే బౌలర్లపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ తెలిపాడు. ఐపీఎల్-17లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, బుమ్రా, సిరాజ్ ఇప్పటికే దీనిపై స్పందించగా.. ఆ జాబితాలో షాబాజ్ అహ్మద్ కూడా చేరాడు. తాజాగా షాబాజ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రతి జట్టులో ఒక ఆల్‌రౌండర్, 8 మంది బ్యాటర్లు ఉంటున్నారు. మొదటి బంతి నుంచి చివరి వరకు దూకుడుగా ఆడే ఆటగాళ్ల కోసం జట్లు చూస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అనుమతినిస్తుంది. కాబట్టి, ఆల్‌రౌండర్ల కంటే బౌలర్లపై ఈ రూల్ ప్రభావం ఎక్కువ. గతంలో ఆల్‌రౌండర్లు నాలుగు ఓవర్లు వేస్తే.. ఇప్పుడు ఒకటి లేదా రెండు ఓవర్లు మాత్రమే వేస్తున్నారు. ఇది నిజం. చాలా మంది ఆల్‌రౌండర్లు దీన్ని ఎదుర్కొంటున్నారు. యాంకర్ల పాత్ర కూడా క్రమంగా తగ్గుతోంది,’ అని చెప్పాడు. కాగా, ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో షాబాజ్ 136 స్ట్రైక్‌రేటుతో 186 పరుగులు చేశాడు. అయితే, బంతితో పెద్దగా ఆకట్టుకోని అతను కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు.


Advertisement

Next Story