- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలోనూ మోత మోగించారు
దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం ఆ జట్టు ఖాతాలో చేరింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 67 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 266/7 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్(89, 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి రెచ్చిపోగా.. అతనికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(46, 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు కూడా తోడవడంతో ఈ జోడీ తొలి వికెట్‌కు 38 బంతుల్లోనే 131 పరుగుల భారీ భాగస్వామ్యం జతచేసింది. షాబాజ్ అహ్మద్(59, 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(37) పర్వాలేదనిపించాడు. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/55) రాణించాడు. అనంతరం 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌటైంది. జేక్ ఫ్రేజర్(65) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్ పొరెల్(42), రిషబ్ పంత్(44) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(4/19) విజృంభించగా.. నితీశ్ రెడ్డి(2/17), మార్కండే(2/26) కీలక వికెట్లు తీశారు. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.