ఐపీఎల్‌లో నేడు 1000వ మ్యాచ్

by Mahesh |   ( Updated:2023-04-30 00:30:21.0  )
ఐపీఎల్‌లో నేడు 1000వ మ్యాచ్
X

ముంబై : ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. భారత టీ20 లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ప్రస్తుతం 16వ సీజన్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జరగబోయే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్. ముంబైలోని వాంఖడే స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్నది.

1000వ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ చిన్నపాటి సంబరాలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఈవెంట్‌ కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో ఐపీఎల్ ఒప్పందం చేసుకుందని వెల్లడించాయి. ‘10 నుంచి 15 నిమిషాలపాటు సెలబ్రేషన్స్‌ జరుగుతాయి. కామెంటేటర్ రవిశాస్త్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో వాలంటీర్లు ‘థ్యాంక్యూ’ జెండాతోపాటు జాతీయ జెండాను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత కెప్టెన్లు రోహిత్ శర్మ, సంజూ శాంసన్‌కు మెమొంటోలను అందజేస్తారు’అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story