బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలిచిన ఆనందంలో జడేజా ఏం చేశాడంటే?

by Harish |
బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలిచిన ఆనందంలో జడేజా ఏం చేశాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8 రౌండ్‌లో టీమ్ ఇండియా అఫ్గానిస్తాన్‌‌ను ఓడించి శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసినందుకు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ వరించింది. భారత ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ప్రతి మ్యాచ్ అనంతరం టీమ్ మేనేజ్‌మెంట్ బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి మెడల్ కోసం జడేజాతోపాటు రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ పోటీపడ్డారు. అయితే, మెడల్ జడేజా‌కు అందజేస్తున్నట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపాడు.

ప్రతిసారి స్పెషల్ గెస్ట్‌తో మెడల్‌ను అందజేసేవారు. ఈ సారి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మెడల్‌ను అందజేయడం విశేషం. ఫీల్డింగ్ కోచ్ ద్రవిడ్ పేరు చెప్పగానే డ్రెస్సింగ్ రూం చప్పట్లతో మారుమోగింది. ద్రవిడ్ చేతుల మీదుగా జడేజా మెడల్‌ను అందుకున్నాడు. ఈ సందర్భంగా జడేజా కోచ్‌ను పైకి ఎత్తుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో జడేజా మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. అలాగే, మూడు ఓవర్లు వేసిన అతను 20 పరుగులే ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే, బ్యాటుతో నిరాశపర్చిన అతను ఐదు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి వెనుదిరిగాడు.

Advertisement

Next Story

Most Viewed