క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌లో ఆ మ్యాచ్‌లు జరగడం డౌటే?

by Harish |
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌లో ఆ మ్యాచ్‌లు జరగడం డౌటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో సోమవారంతో గ్రూపు దశ ముగియనుంది. ఇక, సూపర్-8 రౌండ్‌ మ్యాచ్‌లు అసలైన పొట్టి ప్రపంచకప్ మజాను అందించనున్నాయి. అయితే, వరుణుడు ఆ మ్యాచ్‌లకు అడ్డుతగిలే అవకాశాలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లన్నీ కరేబియన్ దేశాల్లోనే జరగనున్నాయి. ఆ మ్యాచ్‌లకు బార్బడోస్, సెయింట్ లూసియా, ఆంటిగ్వా, సెయింట్ విన్సెంట్ వేదికలు. ఈ వేదికల్లో 12 సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆ వేదికల్లో వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు అక్కడి వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.

ఈ నెల 24న జరిగే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షార్పణమయ్యే చాన్స్ ఉంది. ఆ మ్యాచ్‌కు వేదికైన సెయింట్ లూసియాలో మ్యాచ్ జరిగే రోజు 50 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అలాగే, బార్బడోస్‌లో భారత్, అఫ్గాన్ మ్యాచ్‌కు 50 శాతం, ఆంటిగ్వాలో జరిగే భారత్, బంగ్లా మ్యాచ్‌కు 20 శాతం వర్ష సూచన ఉంది. బార్బడోస్‌లో ఈ నెల 29న జరిగే ఫైనల్ పోరుకు కూడా వరుణుడు అడ్డు తగిలే చాన్స్ ఉంది. కేవలం టీమ్ ఇండియా మ్యాచ్‌లకే కాకుండా ఇతర జట్ల మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story