చెమటోడ్చిన సఫారీలు.. నెదర్లాండ్స్‌పై విజయం

by Harish |
చెమటోడ్చిన సఫారీలు.. నెదర్లాండ్స్‌పై విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూయార్క్ వేదికగా శనివారం జరిగిన గ్రూపు డి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా చెమటోడ్చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసింది. సౌతాఫ్రికా పేసర్ బార్ట్‌మాన్(4/11) ధాటికి డచ్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఎంగెల్‌బ్రెచ్ట్ (40) టాప్ స్కోరర్.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి సౌతాఫ్రికా శ్రమించాల్సి వచ్చింది. 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. డచ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చేయడంతో ఆ జట్టుకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు హెండ్రిక్స్(3), డికాక్(0), కెప్టెన్ మార్‌క్రమ్(0), క్లాసెన్(4) దారుణంగా నిరాశపరిచారు. దీంతో 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్(59 నాటౌట్) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్(33) కూడా రాణించాడు. స్టబ్స్ అవుటైనా మిల్లర్ చివరి వరకూ నిలిచి జట్టును గెలిపించాడు.

సంక్షిప్త స్కోరుబోర్డు

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ : 103/9(20 ఓవర్లు)

(ఎంగెల్‌బ్రెచ్ట్ 40, బార్ట్‌మాన్ 4/11, నోర్జే 2/19, జాన్సెన్ 2/20)

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 106/6(18.5 ఓవర్లు)

(డేవిడ్ మిల్లర్ 59, ట్రిస్టన్ స్టబ్స్ 33, వివియన్ కింగ్మా 2/12, లోగాన్ వాన్ బీక్ 2/21)

Advertisement

Next Story