కల్లు తాగడం ఆలస్యం కావడంతో మహిళ ఆత్మహత్య

by Sridhar Babu |
కల్లు తాగడం ఆలస్యం కావడంతో మహిళ ఆత్మహత్య
X

దిశ, గద్వాల రూరల్ : గద్వాల పట్టణానికి చెందిన మహిళ తాగుడుకు బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్​ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ధరూర్ మెట్టుకు చెందిన సుజాత అనే మహిళ కల్లుకు బానిస అయింది. రోజూ తాగే సమయంకన్నా ఆలస్యం కావడంతో పిచ్చిగా ప్రవర్తించి ఇంటి ఆవరణలో ఉరి వేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.

Advertisement

Next Story